అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని - జనకా! కార్తీకమహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికాదు. ఇప్పుడు నీకు నేను మరో యితిహాసము తెలియ జేయాలి అనుకుంటున్నాను . సావధానుడవై ఆలకింపుమని ఇలా చెప్పసాగారు .
దీపంచెంత నిలబడి వుండగ, నా అదృష్టము కొలదీ ఆ వత్తి అంటుకుని వెలగడం వలన నా పాపములు తొలగిపోయినట్టున్నాయి. వెంటనే పూర్వజన్మగా నాకీ రూపం కలిగింది.” అని వివరించి , ఇలా ప్రశ్నించాడు. “ ఓ మహానుభావా! నేను యెందుకీ మూషిక జన్మ మెత్తవలసివచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు"మని కోరాడు . అప్పుడా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచేత సర్వము తెలుసుకొని, "ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచే వారు.
నీవు జైనమత వంశానికి చెందిన వాడివి . నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ, ధనాశపరుడై దేవపూజలు, నిత్యకర్మలు మరచి, నీచుల సహవాసము చేయడం వలన, నిషిద్ధాన్నము తింటూ , మంచివారిని , యోగ్యులను నిందిస్తూ, పరులచెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మే వృత్తిని చేపట్టి దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టేవాడివి . ఇది చాలక సమస్త తినుబండారములను చాలా చౌకగా కొని, తిరిగి వాటిని యెక్కువ ధరకు అమ్మి, ఆవిధంగా సంపాదించిన ధనము నీవు అనుభవించక, యితరులకు యివ్వక దానిని భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు.
మరణించిన తరువాత యెలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపము అనుభవించ సాగవు . నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందువలన పుణ్యాత్ముడవయ్యావు. దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాబట్టి , నీవు నీ గ్రామమునకు పోయి, నీ పెరటిలో పాతిపెట్తిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలు చేసి, భగవంతుని ప్రార్థించుకొని మోక్షముపొందు"మని అతనికి నీతులు చెప్పి పంపించాడు.
No comments:
Post a Comment