Sunday, December 13, 2020

సూర్యగ్రహణం 14/12/2020 ఈ రోజు గ్రహణం ఉందా లేదా గ్రహణ నియమాలు పాటించాలా వద్దా...?

         ఈ రోజు గ్రహణం ఉందా లేదా గర్భిణీస్త్రీలు నియమాలు పాటించాలా వద్దా..?  





                                ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కేవలం
చిలీ మరియు అర్జెంటీనాలోని కొన్ని ప్రాంతాలలో స్కై-వాచర్స్ పగటిపూట రెండు నిమిషాల పది సెకన్ల చీకటిని చూడవచ్చు. సూర్య గ్రహనం  భారతదేశంలో కనిపించదు కాబట్టి, భారతీయులు  అనుసరించే ఆచారాలు వర్తించవు గర్భిణీస్త్రీలు నియమాలు పాటించనవసరం లేదు. 

ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాని ప్రజలు దీనిని నాసా యొక్క వర్చువల్ లింక్‌లో ప్రత్యక్షంగా చూడవచ్చు.

           సూర్యగ్రహణం 2020: ఈ ప్రదేశాలలో  కనిపిస్తుంది

2020 చివరి సూర్యగ్రహణం ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కనిపించదు. మొత్తం సూర్యగ్రహణం దక్షిణ అమెరికాలో చిలీ మరియు అర్జెంటీనాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. పాక్షిక గ్రహణం పసిఫిక్ మహాసముద్రం, అంటార్కిటికా మరియు దక్షిణ అమెరికాలోని దక్షిణ ప్రాంతాల నుండి కనిపిస్తుంది. చిలీలోని శాంటియాగో, బ్రెజిల్‌లోని సావో పాలో, అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్, పెరూలోని లిమా, ఉరుగ్వేలోని మాంటెవీడియో మరియు పరాగ్వేలోని అసున్సియోన్ ప్రజలు మాత్రమే ఈ సూర్య గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడగలరు. 


సూర్యగ్రహణం 2020 తేదీ మరియు సమయం

(ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు)
(కాబట్టి, భారతీయులు  అనుసరించే ఆచారాలు వర్తించవు గర్భిణీస్త్రీలు నియమాలు పాటించనవసరం లేదు ) 

డిసెంబర్ 14 సోమవారం
సూర్య గ్రహణం  రాత్రి 7:03 గంటలకు (IST) ప్రారంభమై డిసెంబర్ 15 న ఉదయం 12:23 గంటలకు (IST) ముగుస్తుంది.
గరిష్ట గ్రహణం సమయం రాత్రి 9:43 గంటలకు. (IST)


ఈ గ్రహణాన్ని భారతదేశ ప్రజలు  ఆకాశంలో  చూడలేరు. 

ఈ గ్రహణాన్ని నాసా వారి సుజన్యం తో వారి వెబ్సైట్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు.  ↓
>>> Watch live online: https://www.nasa.gov/nasalive <<<< 
( గర్భిణీ స్త్రీలు  ఈ సూర్య గ్రహణ  లైవ్ చూడకండి. ) 

*** ప్రణీత్ కుమార్ శర్మ *** 


Saturday, April 25, 2020

‘డార్క్ వెబ్’‌లో ఫేస్ బుక్ యూజర్ల డేటా లీక్

ఫేస్ బుక్ మరోసారి ఇబ్బందుల్లో పడింది. అయితే ఫేస్ బుక్ యూజర్ల డేటా ‘డార్క్ వెబ్’ లో విక్రయిస్తున్నట్లు తెలిపారు సైబర్ సెక్యురిటీ సంస్థ ‘సోఫోస్’ పరిశోదకుడు  బాబ్  . 267 మిలియన్ యూజర్ల డేటాను ప్రొఫైల్‌తో సహా ‘డార్క్ వెబ్’ లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. 540డాలర్లకు… భారత కరెన్సీలో 41వేల రూపాయలకు ఈ డెటా అమ్ముడవుతుందని అన్నారు. ఫేస్ బుక్ వినియోగదారుల ఐడీలు, పూర్తి పేర్లు, ఈ మెయిల్స్, వ్యక్తిగత అడ్రస్‌లు, వయసు, రిలేషన్ షిప్ స్టేటస్‌లతో సహా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. అయితే పాస్ వర్డ్ మాత్రం అందుబాటులో లేదని అన్నారు.   గత సంవత్సరం ఫేస్ బుక్ నుంచి యూజర్స్ వివరాలు లీక్ అయినట్లు చెప్పిన బాబ్ …. అప్పటికంటే ఇప్పుడు 42మిలియన్ యూజర్ల వివరాలు కొత్తగా లీకైనట్లు చెప్పారు. దీంతో అంతా కలిసి 309మిలియన్ యూజర్ల వివరాలు ‘డార్క్ వెబ్’ లో లభ్యమవుతున్నాయని ఆయన అన్నారు.

300మిలియన్లకు పైగా డేటా ఎలా లీక్ అయిందని ‘సైబుల్’ అనే సంస్థ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. దీంతో పాటు యూజర్ల డేటాను రక్షించడానికి రెండు రకాలపద్దతులను పాలించాలని సూచించింది. ఈ డేటాతో సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడవచ్చని తెలిపింది.

Thursday, March 19, 2020

తిరుమలలో కరోనా కలకలానికి తెరదించిన వైద్యులు...!

         తిరుమలలో కరోనా కలకలానికి తెర పడింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాకు చెందిన దయా శంకర్‌ (65) అనే భక్తుడికి కరోనా టెస్టు నెగటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ టెస్టు రిజల్ట్ రాకతో టీటీడీతో పాటు భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
యూపీకి చెందిన చెందిన దయాశంకర్ అనే 65 ఏళ్ల వృద్ధుడు, మరో 109 మంది ఈ నెల 11న తీర్థయాత్రల కోసం ప్రయాణమయ్యారు. ఇందులో భాగంగా వారంతా తిరుమల చేరుకున్నారు. అయితే దయాశంకర్ లో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు తిరుపతిలోని స్విమ్స్ కు తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి టెస్టులు చేశారు. ఈ పరీక్షల్లో అతడికి కరోనా లేదని తేలిందని గురువారం రాత్రి అధికారులు ప్రకటించారు. దీంతో టీటీడీతో పాటు ఆ 109 మంది, వేలాది భక్తుల్లో నెలకొన్న భయం తొలగిపోయింది              

రోజూ వేలాదిగా తిరుమల కొండకు వచ్చే భక్తులకు కరోనా సోకకుండా నియంత్రణ చర్యల్లో భాగంగా శ్రీవారి దర్శనాన్ని నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం టీటీడీ ఈవో అనిల్ సింఘాాల్ ప్రకటించారు. యథావిధిగా శ్రీవారి కైంకర్యాలు, పూజలను అర్చకులు కొనసాగిస్తారని, భక్తుల దర్శనాన్ని మాత్రమే నిలిపేస్తున్నామని చెప్పారు. పరిస్థితిని బట్టి సమీక్ష చేసుకుని దర్శనం పున: ప్రారంభంపై మళ్లీ నిర్ణయం తీసుకుంటామన్నారు.