Sunday, November 6, 2022
చంద్రగ్రహణ వివరణ 2022
Friday, October 14, 2022
బైసా కిరణ్ దేవి
అక్బర్ అప్పుడు కిరణ్ దేవిని తాకడానికి ప్రయత్నించాడు.కిరణ్ దేవికి విషయం అర్దమైన వెంటనే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా కిరణ్ దేవి తన కోశం నుండి కత్తిని తీసి అక్బర్ ను గట్టిగా తన్ని క్రింద పడవేసింది.తన కుడికాలు పాదము అక్బర్ ఛాతీ పైనుంచి, కత్తిని మెడపై పెట్టి " మూర్ఖుడా!నేను మహారాణా ప్రతాప్ సింగ్ మేనకోడలు ననే విషయం నీకు తెలియదా? ఆ పేరు వింటేనే నీకు నిద్ర పట్టదు.అక్బర్ నీ చివరి కోరికేమిటి?" అన్నది.అక్బర్ రక్తం గడ్డకట్టుకు పోయింది. చక్రవర్తి అని పిలవబడే అక్బర్, బైసా కిరణ్ దేవి అనే మహిళ పాదాలు కింద పడిపోతానని ఎన్నడూ ఊహించి ఉండడు.అప్పుడు అక్బర్ నేను నా గుర్తింపునే కోల్పోయాను, దేవి నన్ను క్షమించు అన్నాడు. అప్పుడు కిరణ్ దేవి ఈరోజు తర్వాత ఏరోజు ఢిల్లీలో నౌరూజ్ జాతర ఉండకూడదు, మీరు ఇకముందు ఏస్త్రీని కూడ ఇబ్బంది పెట్టకూడదు అని కచ్చితంగా చెప్పింది. అక్బర్ చేతులు జోడించి అమె చెప్పిన దానికి సమ్మతించి ఆరోజు నుండి "నౌరూజ్" జాతర నిలిపివేయబడింది. ఈ సంఘటన "గిరిధర్ ఆసియా" స్వరపరిచిన"సౌగత్ రాసో" లోని 7వ పేజీ లో వివరించబడింది. ఈ సంఘటనకు సంబంధించిన చిత్రపటం "దోహా" పట్టణంలో గల బికనూర్ మ్యూజియం లో కలదు.ప్రాణభిక్ష కోరుతూ అక్బర్ చేయి చాసిన మరోక చిత్రపటం జైపూర్ మ్యూజియం లో భద్రపరచబడింది.
-
దీపావళి అంటే ఉత్సవాలు దీపాలు, అలంకరణలు, కొనుగోళ్లు, టపాకాయలు, పూజలు, ప్రార్థనలు, బహుమతులు, ఫలహారాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబం...
-
*🌚చాంద్రాయణవ్రత0🌚* *👉*చాంద్రాయణ వ్రతమంటే చంద్రుని యోక్క కళలను బట్టి ఆహారాన్ని స్వీకరించడం. అమావాస్య నాడు నిరాహారంగా వుండడం, పూర్ణిమ ...
