పాఠశాలల్లో సరికొత్త పర్యావరణ విప్లవం!
తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో "ఒక విద్యార్థి – ఒక మొక్క" అనే వినూత్న కార్యక్రమానికి మన ఊరు- మన చెట్టు ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. ఈ విద్యా సంవత్సరం నుండి స్కూల్లో చేరే ప్రతి కొత్త విద్యార్థి పేరు మీద విధిగా ఒక మొక్కను నాటాలని పిలుపునిస్తున్నారు. వ్యవస్థాపకులు కొత్తపల్లి ప్రణీత్ కుమార్ శర్మ కేవలం మొక్కలు నాటడమే కాకుండా, వాటికి విద్యార్థులే స్వయంగా సంరక్షించాలి అన్నారు. " పిల్లలు పెరగాలి... వారితో పాటే ఈ మొక్కలూ పెరగాలి!" అని సూచించారు. ఈ ప్రచారం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. విద్యా దీప్తితో పాటు పచ్చని పర్యావరణాన్ని అందించే ఈ సంకల్పంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నారు.