Thursday, June 30, 2016

హనుమంతుడి శరీరానికి సింధూరం ఉంటుందేం?

🌞 praneeth Kumar Sharma 🌞.                               
హనుమంతుడి శరీరానికి సింధూరం ఉంటుందేం?
ఒంటి మీద సింధూర వర్ణం లేని హనుమంతుని విగ్రహం అరుదు. ఇంతకీ ఆంజనేయుడు అలా సింధూరపు రంగులో ఎందుకు ఉంటాడు! అనే సందేహం వెనుక అందరికీ ఆదర్శవంతమైన ఓ కథ ఉంది. అదేమిటంటే...
ఒక రోజు హనుమంతులవారు శ్రీరాముని అంతఃపురంలోకి ప్రవేశించారు. అలా ప్రవేశించే సమయంలో సీతమ్మ తన పాపిట సింధూరాన్ని అద్దుకోవడం గమనించాడు ఆంజనేయుడు. సీతమ్మవారు అలా పాపిట సింధూరాన్ని అలముకోవడం చూసి ఆయనకి భలే ఆశ్చర్యం వేసింది.
సీతమ్మ చెంతకి అడుగులో అడుగు వేసుకుంటూ ‘అమ్మా! మీరు నుదుటిన ఆ సింధూరాన్ని ఎందుకు ధరిస్తున్నారు’ అని అడిగాడు. ‘హనుమా! నా స్వామికి సంతోషాన్ని కలిగించేందుకు ఇలా రోజూ సింధూరాన్ని ధరిస్తాను. పైగా ఇలా పాపిట సింధూరాన్ని ధరించడం వల్ల ఆయన దీర్ఘాయుష్షులుగా ఉంటారన్నది నా నమ్మకం!’ అంటూ చిరునవ్వుతో సెలవిచ్చింది జానకి.
సీతమ్మ మాటలు విన్న హనుమంతుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సీతమ్మ పాపిట సింధూరం వెనుక తన స్వామి శ్రేయస్సు, సంతోషం ఉన్నాయా? అనుకుని మురిసిపోయాడు. వెంటనే ఆయన మనసులో ఒక ఉపాయం మెదిలింది. ఈ కాస్త సింధూరాన్ని ధరిస్తేనే స్వామివారి ఆయుష్షు పెరుగుతుందంటే... మరి ఒంటినిండా సింధూరాన్ని ధరిస్తే తిరుగేముంది అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం, తన ఒంటినిండా నూనె కలిపిన సింధూరాన్ని దట్టించాడు.
శిరసు నుంచి పాదాల దాకా సింధూర వర్ణంలో మెరిసిపోతున్న ఆంజనేయుడు... నేరుగా రాముని దర్బారులో ప్రవేశించాడు. ఆ స్థితిలో హనుమంతుని చూసిన రాముడు ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి. ‘ఏమిటి హనుమా! ఒంటి నిండా ఏమిటా రంగు’ అని చిరునవ్వుతో అడిగాడు.
‘స్వామీ! సీతమ్మ తన పాపిట సింధూరం ధరిస్తే మీకు సంతోషమూ, ఆయుష్షూ వృద్ధి చెందుతాయని సెలవిచ్చారు... మరి నేను ఒంటి నిండా సింధూరాన్ని అలముకుంటే మరెంత శ్రేయస్సు కలుగుతుందో కదా! అందుకనే ఇలా...’ అంటూ చెప్పుకొచ్చాడు.
మనుమంతుని మనసులో తన పట్ల ఉన్న ఆరాధనని గమనించిన రాముని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ‘హనుమా! నువ్వు నా భక్తులందరికీ మరోసారి ఆదర్శంగా నిలిచావు. ఇక మీదట ఎవరైతే నీ సింధూరాన్ని ధరిస్తారో... వాళ్లు నీ అనుగ్రహానికే కాదు, నా అనుగ్రహానికి కూడా పాత్రులవుతారు’ అంటూ ఆశీర్వదించారు.
అదిగో అప్పటి నుంచీ హనుమంతుల వారు నిత్యం సింధూరవర్ణంలో మెరిసిపోవడం, ఆయన సింధూరాన్ని మనమూ కాస్త నుదుటిన అద్దుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆయన అనుగ్రహమూ భక్తులకు లభిస్తోంది....... http://sharma108.blogspot.in✍

Monday, June 6, 2016

పూజకు ముందు పసుపుతో వినాయకుడిని ఎందుకు చేస్తారు

*⚜పూజకు ముందు  పసుపుతో వినాయకుడిని ఎందుకు చేస్తారు.?⚜*
గణపతి కోసం చిత్ర ఫలితం
👉 ​​​​"ఆదిపూజ్యోగణాదిపః" అన్నట్లుగా  సమస్తకార్యములు నిర్విగ్నముగ జరుగుటకై  ముందుగా గణపతిని  పూజించాలి. లోక  రక్షణకై  త్రిపురాసుర సంహార సమయములో నందీశ్వరుని  మూడవ  కొమ్ము అనగా  పసుపుకొమ్ము  విరిగి భూమి  పై  పడగా దానిని  వినాయకుడు  మాత్రమే  వెతికి దేవలోకం  చేర్చెను. అప్పుడు  శివుడు ఈ పసుపు కొమ్ము చూర్ణం  తోనే మొదట గణపతి పూజ చేయాలని  ప్రతికార్యము నందు  పసుపు వాడుట మంగళప్రదమని విధి ఏర్పరిచెను.

Sunday, June 5, 2016

నక్షత్రవనంలో నాటవలసిన చెట్లు

*నక్షత్రవనంలో నాటవలసిన చెట్లు.* నక్షత్రవనంలో ఉండాల్సిన 27 మొక్కలకు సంబంధించిన నక్షత్రముల పేర్లు.* 1. అశ్వని నక్షత్రము - కరస్కర 2. భరణి నక్షత్రము - ధాత్రి 3. కృత్తిక నక్షత్రము - ఉదుంబర 4. రోహిణి నక్షత్రము - జంబూ 5. మృగశిర నక్షత్రము - ఖదిర 6. ఆరుద్ర నక్షత్రము - కృష్ణ 7. పునర్వసు నక్షత్రము - వంశీ 8. పుష్యమి నక్షత్రము - పిప్పల 9. ఆశ్లేష నక్షత్రము - నాగ 10. మఖ నక్షత్రము - రోహిణి 11. పూర్వ ఫల్గుణి నక్షత్రము - పలాశ 12. ఉత్తర ఫల్గుణి నక్షత్రము - ప్లక్ష 13. హస్త నక్షత్రము - అంబష్ట 14. చిత్త నక్షత్రము - బిల్వ 15. స్వాతి నక్షత్రము - అర్జున 16. విశాఖ నక్షత్రము - వికంకట 17. అనూరాధ నక్షత్రము - బకుళ 18. జ్యేష్ట నక్షత్రము - సరళ 19. మూల నక్షత్రము - సర్జు 20. పూర్వాషాఢ నక్షత్రము - వంజుల 21. ఉత్తరాషాఢ నక్షత్రము - పనస 22. శ్రవణ నక్షత్రము - అర్క 23. ధనిష్ఠ నక్షత్రము - శమీ 24. శతభిష నక్షత్రము - కదంబ 25. పూర్వాబాధ్ర నక్షత్రము - నింబ 26. ఉత్తరాబాధ్ర నక్షత్రము - ఆమ్ర 27. రేవతి నక్షత్రము - మధుక.                  http://sharma108.blogspot.in/...✍

Friday, June 3, 2016

*🌚చాంద్రాయణవ్రత0🌚*

*🌚చాంద్రాయణవ్రత0🌚*
*👉*​​చాంద్రాయణ వ్రతమంటే  చంద్రుని యోక్క  కళలను బట్టి ఆహారాన్ని స్వీకరించడం. అమావాస్య నాడు నిరాహారంగా వుండడం, పూర్ణిమ నాడు సంపూర్ణంగా  భోజనం చేయడం. శుద్ద పాడ్యమి రోజు  ఒక ముద్ద (సాలగ్రామ పరిమాణం ) లో  భుజించాలి. అలా పూర్ణిమ వరకు పెంచుకుంటూ పదిహేను ముద్దలు(సాలగ్రామ పరిమాణంలో) తీసుకోవాలి. మరల బహుళ పాడ్యమి నాడు పదునాలుగు అలా రోజు రోజుకు ఒక ముద్ద తగ్గించుకుంటూ అమావాస్య  నాడు ఉపవసించాలి. దీనినే చాంద్రాయణ వ్రతమంటారు. కొన్ని పాపాలకు శాస్త్రాo లో  ప్రయశ్చిత్తలు చెప్పబడలేదు అటువంటి పాపాలన్నీ చాంద్రాయణ వ్రతం వలన నశిస్తాయి. పాప ప్రక్షాళన  కోసం కాకుండా పుణ్యసముపార్జన కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తే , దేహాంతం  లో  మహాపుణ్యమును పొంది చoద్ర లోకాన్ని  చేరుకుంటాడు. ఇది కుల గోత్రాలతో సంబంధం లేదు. అందరూ ఆచరించవచ్చును. పాపులు ఒక్క కులంలోనే ఉండరు  కదా!               🌻http://sharma108.blogspot.in/ ...✍

.పుణ్యం కోసమో లేక మరేదో

1.పుణ్యం కోసమో లేక మరేదో ఆశించి చేసే దానం , దానం కాదు. దాత దానం చేసిన వెంటనే మర్చిపోవాలి. చేసిన దానం మూడో కంటికి తెలియకూడదు. అలా చేస్తేనే దాన ఫలం లభిస్తుంది. అదే గుప్త దానం.
2.నవరత్న ఉంగరములు అందరు పెట్టుకొనరాదు. ఎవరికి ఏ రత్నం ధరించవచ్చునో దానిని ధరించుట మంచిది.
3.జాతి రత్నములు వేలికి ధరించినపుడు నియమాలు పాటించాలి. పాటించని పక్షములో మంచికన్నా చెడె ఎక్కువ జరుగును. ధరించి ఉన్నపుడు స్త్రీసంపర్కము, మైల, శవములు తాకుట, జూదము, బహిష్టులను తాకుట లాంటి దోషముల వల్ల రత్న ప్రభావము నశించును. అట్టి సమయమందు పౌర్ణమి నాడు రాత్రి మేకపాలు తెచ్చి , వాటితో శుద్ధి చేసేది. (లేదా) పసుపు నీళ్ళు తో శుద్ధి చేసి ,సాంబ్రాణి పొగ వేసేది.
4.జాతి రత్నములు ధరించునపుడు ఎన్ని కారేట్లులో పెట్టుకోవాలంటే తొమ్మిది సంవత్సరముల లోపువాల్లకి ఒక కేరెట్ , పదునెనిమిది సంవత్సరములోపు వారు రెండు కేరెట్లు, ఆపై వారికి మూడు కేరెట్లు బరువు ఉండునట్లు ఉంగరము చేఇంచి, అడుగు భాగము ఆరత్నము శరీరమునకు తగులునట్లు ధరించాలి.
5.మనం వాడే వస్తువులు కొన్ని విరిగి పోతూఉంటై. వాటిని వాడటం శ్రేయస్కరము కాదు. వాటిని పారవేయాలి. ఉదా: అద్దాలు, దేవుని ప్రతిమలు.
6.కుడి చేత్తో చేయాల్సిన పనులు ఎడమ చేతితో, ఎడమ చేత్తో చేయాల్సిన పనులు కుడిచేతితో చేయరాదు.
7.రుద్రాక్షలు కార్తీక మాసంలో, సోమవారం రోజున ధరిస్తే మంచిది. అవసరమనుకుంటే ఎపుడైనా ధరించ వచ్చు. కాని ఆవు పాలతో ఆ రుద్రాక్షను కడిగి, నూటయెనిమిది సార్లు ఓం నమ్హ శివాయ మంత్ర జపం చేసి ధరస్తే మంచిది.
8.కాకి తలపై తన్నిన, తగిలిన దోషం, వెంటనే తలస్నానం చేసి, శివ దర్శనము చేసుకోవాలి. ఎక్కువ సార్లు అలా జరిగిన మూడు రకాల నూనెలతో దీపం వెలిగించాలి, మరియు శివునకు రుద్రాభిషేకం చేఇంచేది.
9.నూనె క్రింద పడితే శుబ్రం చేసుకోండి గాని దానిని ఎత్తి గిన్నెలో పోసుకొని వాడవద్దు.
10.చీకటి పడిన తర్వాత ఇల్లు వూడవరాదు.(చిమ్మ రాదు)
11.శనివారం రోజు నూనెతో శరీరాన్ని మర్దన చేసి స్నానం చేయరాదు.

Thursday, June 2, 2016

శిశు జనన నక్షత్ర పాదదోషాలు


   శిశు జనన నక్షత్రపాదదోషాలు


                          

నక్షత్రములు1వ పాదం2వ పాదం3వ పాదం4వ పాదం
అశ్వనిశిశువునకు,తండ్రికిదోషంలేదుదోషంలేదుసామాన్యదోషం
భరణిసామాన్యదోషందోషంలేదుమగ-తండ్రికి,ఆడ-తల్లికిశిశువునకు
కృత్తికమంచిదిమంచిదిమగ-తండ్రికి,ఆడ-తల్లికితల్లికి
రోహిణిమేనమామకు,తల్లికిమేనమామకు,తల్లికిమేనమామకు,తల్లికిమేనమామకు,తండ్రికి
మృగశిరమంచిదిమంచిదిమంచిదిమంచిది
ఆరుద్రమంచిదిమంచిదిమంచిదితల్లికి
పునర్వసుమంచిదిమంచిదిమంచిదిమంచిది
పుష్యమిసామాన్యదోషంపగలు-తండ్రికి,రాత్రి-తల్లికిపగలు-తండ్రికి,రాత్రి-తల్లికిసామాన్యదోషం
ఆశ్రేషదోషంలేదుశిశువునకు,ధనమునకుతల్లికితండ్రికి
మఖశిశువుకు,తండ్రికిమగ-తండ్రికి,ఆడ-తల్లికిమగ-తండ్రికి,ఆడ-తల్లికిమంచిది
పూర్వఫల్గుణిమంచిదిమంచిదిమంచిదితల్లికి
ఉత్తరఫల్గుణిమగ-తండ్రికిమంచిదిమంచిదిమగ-తండ్రికి
హస్తమంచిదిమంచిదిమగ-తండ్రికి,ఆడ-తల్లికిమంచిది
చిత్తమగ-తండ్రికితండ్రికితండ్రికిసామాన్యదోషం
స్వాతిమంచిదిమంచిదిమంచిదిమంచిది
విశాఖమగ-బావమరది,ఆడ-మరదలుమగ-బావమరది,ఆడ-మరదలుమగ-బావమరది,ఆడ-మరదలుమగ-తల్లికి,బావమరది,ఆడ-మరదలు
అనూరాధమంచిదిమంచిదిమంచిదిమంచిది
జ్యేష్టసౌఖ్యహాని,తల్లికిసోదరులకు,మేనమామకుశిశువుకు,తల్లికి,పెదతండ్రికితండ్రికి,అన్నకు
మూలతండ్రికితల్లికిధనమునకుమంచిది
పూర్వాషాఢమంచిదిమంచిదిమగ-తండ్రికి,ఆడ-తల్లికిమంచిది
ఉత్తరాషాఢమంచిదిమంచిదిమంచిదిమంచిది
శ్రవణంమంచిదిమంచిదిమంచిదిమంచిది
ధనిష్టమంచిదిమంచిదిమంచిదిమంచిది
శతభిషంమంచిదిమంచిదిమంచిదిమంచిది
పూర్వాభద్రమంచిదిమంచిదిమంచిదిమంచిది
ఉత్తరాభద్రమంచిదిమంచిదిమంచిదిమంచిది
రేవతిమంచిదిమంచిదిమంచిదితండ్రికి