కార్తీకమాసములో నదీస్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకి ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అయ్యే ఖర్చు మొత్తం భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినప్పటికీ ఆ కార్యమును నిర్వహించిన ఫలము దక్కుతుంది .
ఈవిధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినట్టయితే ఎంతటి మహాపాపము చేసినా , యెంతటి దుష్కృత్యములు చేసినా , ఆఖరికి వ్యభిచారం చేసినా అ పాపములన్ని తొలగిపోతాయి . ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించినా ఇలా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము జేసినందువలన వచ్చే ఫలమునకు సరితూగవు.
దీనికన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీకమాసములో భక్తిశ్రద్ధలతో కన్యాదానము చేసినట్టయితే తను తరించడమే కాక , పితృదేవతలను కూడ తరింప జేసిన వాడు కాగలడు .ఈ విషయాన్ని వివరంగా తెలియజేసే ఒక యితిహాసాన్ని నీకిప్పుడు చెబుతాను , శ్రద్ధగా వినమని ఈ విధంగా చెప్పనారంభించాడు .
సువీర చరిత్ర:
ద్వాపరయుగములో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన "సువీరు" డనే ఒక రాజుండేవాడు . ఆయన భార్య పేరు రూపవతి. ఒకసారి సువీరనకి శత్రురాజుల చేతిలో ఓడిపోయి, భార్యతో అరణ్యమునకు పారిపోవలసిన దుస్థితి దాపురించింది. ధన హీనుడయి నర్మదా నదీ తీరములో ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదుల తింటూ కాలము గడపసాగాడు.
కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికకు జన్మనిచ్చింది . తల్లిదండ్రులు ఆ బిడ్డను అతి గారాబముతో పెంచసాగారు . క్షత్రియ వంశములో జన్మించిన ఆ బాలికకు ఆహరాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ, శుక్లపక్ష చంద్రునివలె దినదినాభివృద్ధి పొందుతూ , అతి గారాబముతో పెరుగుచుండెను. ఆమె చూచువారలకు కనులపండువుగా, ముద్దు లొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండే కన్యావిక్రయము చేసిన వారికి ప్రాయశ్చిత్తమే లేదని పెద్దలు చెప్పి ఉన్నారు . కాబట్టి , రాబోయే కార్తీకమాసములో నీ రెండవ కుమార్తెను నీ శక్తికొలది బంగారు ఆభరణములతో అలంకరించి, సదాచార సంపన్నునకి , ధర్మబుద్ధిగలవానికి కన్యాదానము చేయి . ఈ విధంగా చేస్తే , నీవు గంగాస్నానము చేసిన ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయేగాక, మొదటి కన్యను అమ్మడం వలన మూటగట్టుకున్న పాప ఫలము కూడా తొలగి పోతుంది " అని రాజునకు హితోపదేశము చేశాడు
అందుకా రాజు చిరునవ్వు నవ్వి, "ఓ మునివర్యా! దేహ సుఖము కంటె దాన ధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కువా? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను సిరి సంపదలతోను సుఖముగా వుండక, చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షము కోసము ప్రస్తుతమున్న అవకాశమును చేజేతులారా జార విడువమంటారా? ధనము, బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింప గలరుకాని, ముక్కు మూసుకొని, నోరు మూసుకొని, బక్కచిక్కి శల్యమై యున్న వారిని లోకము గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు, కాబట్టి , నా రెండవ కుమర్తెను కూడా నేనడిగినంత ధనమెవరిస్తారో వారికే యిచ్చి పెండ్లి చేస్తాను . అంతే కాని, కన్యా దానము మాత్రము చేయను" అని నిక్కచ్చిగా చెప్పాడు . ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు.
వివాహము చేసాడు . ఆ విధంగా కన్యాదానము చేయడం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై, స్వర్గ లోకములో ఉన్న పితృ దేవతలను కలుసుకున్నాడు .
కన్యా దానము వలన మహా పాపములు కూడా నాశనమవుతాయి . వివాహ విషయములో ఎవరికైనా మాట సహాయము చేసినా , పుణ్యము కలుగుతుంది . కార్తీక మాసములో కన్యాదానము చేయాలని దీక్షబూని అచరించినవాడు, విష్ణుసాన్నిధ్యము పొందుతాడు . శక్తి కలిగియుండి ఉదాసీనత చూపు వాడు శాశ్వత నరకమును పొందగలడు .
No comments:
Post a Comment