Wednesday, June 3, 2026

ఒక అడ్మిషన్ – ఒక మొక్క

 🌱 📚 ఒక అడ్మిషన్ – ఒక మొక్క🌳

 పాఠశాలల్లో సరికొత్త పర్యావరణ విప్లవం!

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో "ఒక విద్యార్థి – ఒక మొక్క" అనే వినూత్న కార్యక్రమానికి మన ఊరు- మన చెట్టు ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. ఈ విద్యా సంవత్సరం నుండి స్కూల్లో చేరే ప్రతి కొత్త విద్యార్థి పేరు మీద విధిగా ఒక మొక్కను నాటాలని పిలుపునిస్తున్నారు. వ్యవస్థాపకులు కొత్తపల్లి ప్రణీత్ కుమార్ శర్మ కేవలం మొక్కలు నాటడమే కాకుండా, వాటికి విద్యార్థులే స్వయంగా సంరక్షించాలి అన్నారు. " పిల్లలు పెరగాలి... వారితో పాటే ఈ మొక్కలూ పెరగాలి!" అని సూచించారు. ఈ ప్రచారం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. విద్యా దీప్తితో పాటు పచ్చని పర్యావరణాన్ని అందించే ఈ సంకల్పంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నారు. 

Sunday, November 6, 2022

చంద్రగ్రహణ వివరణ 2022

ఈ సంవత్సరం నవంబర్ 8 వ తేదీ మంగళవారం కార్తిక పూర్ణిమ రోజున చంద్ర గ్రహణం ఉంది. 
ఉదయం 5 గంటల 30 ని.ల లోపు కార్తీక పూర్ణిమ స్నాన దానాదులు పూర్తి చేసి, ఉదయం 8 లోపు దీపాలు వెలిగించుకోని, దీపధానాలు పూర్తి చేసుకోగలరు. ఉదయం 11:00 గంటల లోపే బాల, వృద్ధ, వ్యాధిగ్రస్తులంతా భోజనాదులు ముగించాలి. 

సూర్యాస్తమయ స్పర్శ ఉన్నందున మనం ఆచరించవలసి వస్తుంది.

స్పర్శ కాలం : మధ్యాహ్నం 2 - 39 ని.లు
మధ్య కాలం : మధ్యాహ్నం 3 - 39 ని.లు.
మోక్ష కాలం : సాయంత్రం : 6 - 19 ని.లు.

ఈ సమయంలో గర్భవతులు బయటకు రాకండా ఉండటం మంచిది.

గ్రహణ మోక్ష కాలానంతరం అంటే 6:30 తరువాత సాయత్రం నిత్య కార్యక్రమాలు శుభం 

ప్రత్యేకంగా మేషరాశి యందు గ్రహణం ఉన్నందున ఆ రాశి వారు బియ్యం, మినుములు, నాగ ప్రతిమ, చంద్ర ప్రతిమ, దక్షిణతో కూడిన భోజన ద్రవ్యం దానం చేయాలి. 

సాధారణంగా గ్రహణ సమయంలో చేసే స్నాన, జప, హోమ , తర్పణ, దానాదులకు విశేష ఫలితం ఉంటుంది. 
శక్తి గల వారందరూ ఆచరించవచ్చును !!

యతోధర్మః తతోజయః
 సర్వేజనాఃశుఖినోభవంతు 
సమస్త సన్మంగళానిభవంతు

Friday, October 14, 2022

బైసా కిరణ్ దేవి

 అక్బర్ ప్రతి సంవత్సరం ఢిల్లీలో "నౌరూజ్ పెయిర్" నిర్వహించేవారు.ఇందులో పురుషులకు ప్రవేశించడానికి అనుమతి లేదు. కానీ అక్బర్ ఈ కార్యక్రమానికి మహిళల దుస్తులతో వెళ్యేవాడు.అక్కడకు వచ్చిన అందమైన తనకు నచ్చిన మహిళలను అక్బర్ వద్దకు తీసుకుని రావడానికి అతని పని మనుషులు (స్త్రీలు) మోసపూరిత మాటలతో అతను దగ్గరకు తీసుకుని వేళ్లే ప్రయత్నం చేసేవారు. "నౌరూజ్" జాతరకు ఒకరోజు మహారాణా ప్రతాప్ సింగ్ మేనకోడలు బైసాదేవి చూడడానికి వచ్చింది. బైసా కిరణ్ దేవి రూపాన్ని చూసిన స్త్రీ వేషంలో ఉన్న అక్బర్ తనను తాను నియంత్రించకోనంతగా మనసు పడ్డాడు. అతనేమాత్రం ఆలోచించకుండా పనిమనుషులు ద్వారా అమెను రాజభవనమునకు మోసపూరిత మాటలతో నమ్మించి పిలిపించాడు.

అక్బర్ అప్పుడు కిరణ్ దేవిని తాకడానికి ప్రయత్నించాడు.కిరణ్ దేవికి విషయం అర్దమైన వెంటనే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా కిరణ్ దేవి తన కోశం నుండి కత్తిని తీసి అక్బర్ ను గట్టిగా తన్ని క్రింద పడవేసింది.తన కుడికాలు పాదము అక్బర్ ఛాతీ పైనుంచి, కత్తిని మెడపై పెట్టి " మూర్ఖుడా!నేను మహారాణా ప్రతాప్ సింగ్ మేనకోడలు ననే విషయం నీకు తెలియదా? ఆ పేరు వింటేనే నీకు నిద్ర పట్టదు.అక్బర్ నీ చివరి కోరికేమిటి?" అన్నది.అక్బర్ రక్తం గడ్డకట్టుకు పోయింది. చక్రవర్తి అని పిలవబడే అక్బర్, బైసా కిరణ్ దేవి అనే మహిళ పాదాలు కింద పడిపోతానని ఎన్నడూ ఊహించి ఉండడు.అప్పుడు అక్బర్ నేను నా గుర్తింపునే కోల్పోయాను, దేవి నన్ను క్షమించు అన్నాడు. అప్పుడు కిరణ్ దేవి ఈరోజు తర్వాత ఏరోజు ఢిల్లీలో నౌరూజ్ జాతర ఉండకూడదు, మీరు ఇకముందు ఏస్త్రీని కూడ ఇబ్బంది పెట్టకూడదు అని కచ్చితంగా చెప్పింది. అక్బర్ చేతులు జోడించి అమె చెప్పిన దానికి సమ్మతించి ఆరోజు నుండి "నౌరూజ్" జాతర నిలిపివేయబడింది. ఈ సంఘటన "గిరిధర్ ఆసియా" స్వరపరిచిన"సౌగత్ రాసో" లోని 7వ పేజీ లో వివరించబడింది. ఈ సంఘటనకు సంబంధించిన చిత్రపటం "దోహా" పట్టణంలో గల బికనూర్ మ్యూజియం లో కలదు.ప్రాణభిక్ష కోరుతూ అక్బర్ చేయి చాసిన మరోక చిత్రపటం జైపూర్ మ్యూజియం లో భద్రపరచబడింది.

"ఇలాంటి విజయగాథలు ఎన్నో"
చరిత్ర తెలుచుకోండి, సంస్క్రతి పాటించండి,
సంప్రదాయలు అలవర్చుకోండి.
...సేకరణ:--- రాయలసేన

Sunday, October 31, 2021

దీపావళి విశిష్టత.

దీపావళి అంటే ఉత్సవాలు దీపాలు, అలంకరణలు, కొనుగోళ్లు, టపాకాయలు, పూజలు, ప్రార్థనలు, బహుమతులు, ఫలహారాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు.వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.

దీపాలంకరణ మరియు లక్ష్మీ పూజ

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలొ దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు.

దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి వచ్చి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు.ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వెస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది.

అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు.తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు.ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని,సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు.తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ త్రిలోకాథిపతీ "నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలిని అవుతాను అని సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.

నరక చతుర్దశి

కృష్ణుడు మరియు సత్యభామ కలిసి నరకాసురడి సైన్యాలతో పోరాడుతున్న చిత్రం.ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది.నరకాసురుడనే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు.కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు.అతడు లోక కంటకుడైనా మహావిష్ణువు వధించరాదని తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి.

మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది.అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు.నరకుని చెరనుండి సాధుజనులు,పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు ధ్రర్మం సుప్రతిష్ఠమైంది.

నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు.ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి.

ప్రణీత్ కుమార్ శర్మ (మల్యాల) 
8332991450.

Tuesday, June 15, 2021

మనమాట మంచి మాట- 2

కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనుకబడుతావ్
తర్వాత పరిగెత్తినా ప్రయోజనం ఉండదు.
 

మనమాట మంచి మాట - 1

మూసిన నోట్లోకి ఈగలు ఎలాగాతే దూరవో, అదే విధంగా నోరు అదుపులో ఉంచుకుంటే అనవసరపు గొడవలు తలకు చుట్టుకోవు..

Tuesday, May 25, 2021

చంద్రగ్రహణం26/05/20212021 బుధవారం రోజు గ్రహణం ఉందా లేదా గ్రహణ నియమాలు పాటించాలా వద్దా...?

శ్రీ ప్లవనామ సంవత్సర వైశాఖ పూర్ణిమ 26 మే 2021 బుధవారం వృశ్చికరాశి అనూరాధ నక్షత్రంలో కేతుగ్రస్త చంద్ర గ్రహణం సంభవించనున్నది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఈ విషయాన్ని గమనించిన గర్భిణిస్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలా..? గ్రహణం ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఏర్పడుతున్నది..? గర్భిణి స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అని మాకు చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు, వారు పడుతున్న భయందోళనలు చూసి ఈ వ్యాసం వ్రాయడం జరిగినది.

ఈ చంద్ర గ్రహణం మన తెలుగు రాష్ట్రాల వారికి అస్సలు వర్తించదు. గ్రహణ నియమాలు ఏమి పాటించనవసరం లేదు. అన్ని పంచాంగాలు కూడా ముక్త కంఠoతో ఈ సంవత్సరం మనకు అసలు గ్రహణాలే లేవని తెలియజేస్తున్నాయి, ఇతర ప్రాంతాలలో ఎక్కడైన గ్రహణాలు ఏర్పడినా అవి మనకు వర్తించవనే తెలియజేసారు. 

                               ప్రణీత్ కుమార్ శర్మ  
            (ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు)
       (కాబట్టి, భారతీయులు  అనుసరించే ఆచారాలు వర్తించవు                      గర్భిణీస్త్రీలు నియమాలు పాటించనవసరం లేదు )