Saturday, August 5, 2017

కేతుగ్రస్త చంద్రగ్రహణం

ఈ సం|| శ్రావణ శుక్ల పూర్ణిమా సోమవారము 07-08-2017 నాడు శ్రవణా నక్షత్రములో మకరరాశిలో చూడామణి నామక అర్గలగ్రాస కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించును.

ఈ గ్రహణమున పుణ్యము అధికముగా వచ్చును.

స్పర్శ కాలం రాత్రి10: 52 మధ్యకాలం
మధ్యకాలం రాత్రి 11: 50
మోక్ష కాలం రాత్రి 12:49

మొత్తం పుణ్యకాలం గం. 1:57 నిమిషాలు    
 ఇది రాత్రి ద్వితీయ యామమన ఆరంభమగుచున్నది.

కనుక నిత్య భోజన, ఆబ్దికాదులను పగలు ద్వితీయ యామము లోగానే (అనగా పగలు 12.20 లోగానే) జరుపుకొనవలెను.

అశక్తులు (అనగా చిన్నపిల్లలు = వృదులు - వ్యాధితులు - గర్భిణులు) మాత్రము గ్రహణారంభ యామము నుండి సార్ధయామ కాలమును విడచి - అనగా సోమవారం  సా. 5.00 లోగా ఆహారాదులను స్వీకరించవచ్చును.

  సోమవారం మధ్యాహ్నం  11:30 ని// లోపు నూతన యజ్ఞోపవీతన దారణ, రక్షాభందన్ జరుపుకోవాలి.
           👉 ప్రణీత్ కుమార్ శర్మ
                     (మల్యాల)
         Cell no:-8332991450
 @ ఆబ్ధికాలు  అంటే  పితృదేవతలకు చేసే కార్యక్రమాలు.

No comments:

Post a Comment